Nagarjuna

Nagarjuna: రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ రిజల్ట్ పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Nagarjuna: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్‌గా నటించిన “కూలీ” ఇటీవల థియేటర్లలో విడుదలై భారీ అంచనాలు రేపింది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్నా, రెండో రోజుకి సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

కొంతమంది విమర్శకులు – “ఇది రజనీకాంత్ చేయాల్సిన సినిమా కాదు. లోకేష్ కనకరాజ్ స్థాయికి తగ్గ ప్రాజెక్ట్ కాదు” అని అభిప్రాయపడ్డారు. మరికొందరు – “నాగార్జున లాంటి నటుడు ఇలాంటి రొటీన్ విలన్ పాత్రలో కనిపిస్తాడని ఊహించలేదు. ఇందులో కొత్తదనం ఏమీలేదు” అంటూ కామెంట్లు చేశారు.

nagarjuna

ఈ విమర్శలపై నాగార్జున స్పందిస్తూ ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలైన స్టేట్‌మెంట్‌లో ఆయన మాట్లాడుతూ –

“రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం నా కెరీర్‌లో ఒక మరపురాని అనుభవం. మా ఇద్దరి విభిన్న సినీ ప్రయాణాలు తెరపై కలిసినప్పుడు ఒక మాగ్నెటిక్ మ్యాజిక్ సృష్టించాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం మా కోసం ప్రత్యేకమైన అనుభూతి. నా పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది” అని తెలిపారు.

nagarjuna

అంతేకాకుండా, ఒక గొప్ప సినిమా విజయానికి నటుల మధ్య కెమిస్ట్రీ, ప్రేక్షకుల్లో నిలిచిపోయే థ్రిల్‌నే ప్రధాన బలం అని ఆయన వివరించారు.

కూలీ సెట్స్ నుండి థియేటర్ల దాకా ఈ ప్రయాణం ఒక వారసత్వం, ఒక రీక్రియేషన్ వేడుకలా సాగింది. రికార్డులు బద్దలు కొట్టాలని మేము ఆశించాము, అవి నిజంగా బద్దలయ్యాయి” అని నాగార్జున స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AUS vs IND: బూమ్..బూమ్..బుమ్రా.. వాకా గ్రౌండ్ లో 5 వికెట్ల ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *