Nagarjuna Sagar Dam:ఆధునిక దేవాలయంగా తెలుగు ప్రజలతో కొనియాడబడుతున్న నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరందించే ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల వరప్రధాయినిగా నిలిచింది. అలాంటి ప్రాజెక్టు జలాశయం ఎగువ నుంచి వచ్చే వరదనీటితో నిండుకుండను తలపిస్తున్నది.
Nagarjuna Sagar Dam:గత కొన్నేళ్ల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పిల్ వే దెబ్బతింటూనే ఉన్నది. జలాశయానికి భారీగా వరదనీరు వచ్చినప్పుడల్లా స్పిల్ వే దెబ్బతింటూనే ఉన్నది. వాస్తవంగా సాగర్ క్రస్ట్ గేట్ల సామర్థ్యం 20 లక్షల క్యూసెక్కులు కాగా, అంతకు మించి వరద నీరు వచ్చిన సమయంలో దెబ్బతింటున్నది. అయితే దెబ్బతిన్న చోట సాధారణ మరమ్మతులతో వదిలేస్తున్నారు.
Nagarjuna Sagar Dam:స్పిల్‌వే పెద్దగా దెబ్బతినడంతో 2012లో రూ.40 కోట్లతో మరమ్మతు పనులు చేశారు. జాతీయ నిర్మాణ సంస్థ సూచన మేరకు కాంక్రీట్ మిక్స్ డిజైన్ ప్రకారం ఎం60 గ్రేడ్ సిలికా ఫ్యూమ్, స్టీల్ వైర్ ఫైబర్‌తో గుంతలను పూడ్చారు. ఒక క్యూబిక్ మీటరు పరిధిలోని గుంతలను పూడ్చేందుకు స్టీల్ వైర్ ఫైబర్ 40 కిలోలు వినియోగించారు. ఆ ప్రాంతాల్లో ఓ చోట మినహా ఎక్కడా దెబ్బతినలేదు.
Nagarjuna Sagar Dam:వేరోచోట్ల స్పిల్ వే దెబ్బతినడంతో డ్యాంకు ముప్పు ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2013, 2020, 2021లో వచ్చిన భారీ వరదలతో 30 మీటర్ల మేర గుంతలు ఏర్పడటంతో ఈ ప్రమాదం నెలకొన్నది. గుంతల పరిమాణం పెరగడంతో 2022లో అప్పటి ప్రభుత్వం రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు మరోచోట మళ్లీ గుంతలు ఏర్పడ్డాయని హెచ్చరిస్తున్నారు.