Bigg Boss 9: తెలుగులో భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి కాగా, 9వ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సారి మొదటిసారిగా “అగ్నిపరీక్ష” పేరుతో కామన్ పీపుల్‌కు కూడా అవకాశం ఇస్తున్నారు.
అగ్నిపరీక్ష కాన్సెప్ట్
ఆగస్టు 22 నుంచి 40 మంది సామాన్యులను ఎంపిక చేసి, ప్రత్యేక టాస్కులు ఇస్తారు. అందులో గెలిచిన ముగ్గురు బిగ్ బాస్ హౌస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ పొందుతారు. ఈ అగ్నిపరీక్ష జియో సినిమా (హాట్‌స్టార్ కాకుండా) ఓటీటీలో ప్రసారం కానుంది.
హోస్ట్ నాగార్జున – భారీ రెమ్యునరేషన్
వరుసగా బిగ్ బాస్ తెలుగు సీజన్లకు హోస్ట్‌గా ఉంటున్న అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కూ ఫైనల్ అయ్యాడు. ఈసారి ఆయన రెమ్యునరేషన్ ఏకంగా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్యగా ఉంటుందని సమాచారం. గత ఏడాది రూ.20 కోట్ల వరకు తీసుకున్న నాగ్, ఈసారి దాదాపు 50% ఎక్కువ పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kingdom: కింగ్డమ్ బాక్సాఫీస్ రిపోర్ట్: సెకండ్ వీకెండ్లో షాకింగ్ ఫలితాలు!
కంటెస్టెంట్ల జాబితా – ఈ సారి స్టార్ పవర్ ఎక్కువ
గత ఏడాది పెద్దగా పేరు తెలియని వాళ్లను తీసుకోవడంతో సీజన్‌కు స్పందన తగ్గింది. అందుకే ఈ సారి ఫేమ్ ఉన్న సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కమెడియన్ ఇమాన్యుయేల్, సోషల్ మీడియా స్టార్ రమ్య మోక్ష, అలేఖ్య (చిట్టి పికిల్స్) పేర్లు వినిపిస్తున్నాయి. అదనంగా కొన్ని సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్లు కూడా హౌస్‌లోకి రావచ్చని టాక్ ఉంది.
కొత్త ప్రోమో – డబుల్ హౌస్ కాన్సెప్ట్
స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున, వెన్నెల కిశోర్ కలిసి కనిపించారు. “డబుల్ హౌస్.. డబుల్ డోస్.. చదరంగం కాదు రణరంగం” అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఈ సీజన్లో కొత్త ట్విస్టులు, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని సూచిస్తోంది.