Nagarjuna: రీసెంట్ గా కుబేరా తో ఆకట్టుకున్న కింగ్ నాగార్జున.. ప్రస్తుతం కూలీతో సందడి చేస్తున్నారు. ఈమధ్య మనం మూవీని జపాన్ లో రిలీజ్ చేశారు కూడా. ఇప్పుడు తన 100వ సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. కోలీవుడ్ డైరెక్టర్, రా.కార్తీక్.. కింగ్ కి యాక్షన్ చెప్పబోతున్నారు..
Also Read: Nayanthara: టీజర్ అదిరిందిగా!.. నయనతార స్టైల్ అండ్ స్వాగ్..
కూలీలో స్టైలిష్ విలన్ సైమన్ గా అదరగొట్టేశారు నాగ్. ఇప్పుడు కార్తీక్ తో చెయ్యబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు 29న బర్త్ డే సందర్భంగా.. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రకటించబోతున్నారట. దీనికోసం ఓ క్రేజీ లుక్ కూడా రెడీ చేశారని తెలుస్తోంది. అన్నపూర్ణ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, తన వందో సినిమాని ఓన్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు నాగార్జున. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.