Nagar Kurnool Woman Gang Rape: హైదరాబాద్ మహానగరానికి వచ్చిన ఓ విదేశీ మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన రోజే జరిగిన మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై 9 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రంతా ఆమెపై లైంగికదాడి చేస్తూ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనలో విస్తుపోయే విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
Nagar Kurnool Woman Gang Rape: నాగర్ కర్నూల్ జిల్లా భూత్పూర్ మండలానికి చెందిన ఓ వివాహిత యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండపేటకు వచ్చింది. ఆ ఊరి శివారులోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లింది. అక్కడే పూజలు చేసి రాత్రి అక్కడే నిద్ర చేయాలని భావించారు. అదేరోజు ఆ ఆలయంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో, సాయంత్రంపూట జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్నది. రాత్రిపూట ఆలయంలో ఉన్న మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో బహిర్భూమికి వెళ్లేందుకు తన బంధువుతో కలిసి ఆలయం వెలుపలకు వెళ్లింది.
Nagar Kurnool Woman Gang Rape: ఆలయ సమీపంలోనే ఉన్న గుట్టవైపు వెళ్తుండగా, ఆలయంలో పనిచేసే ఒక కాంట్రాక్ట్ కార్మికుడు పసిగట్టాడు. ఆ తర్వాత తన స్నేహితువలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈ లోగా ఆలయం వద్దే మద్యం తాగుతూ ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆ యువతి బంధువుపై దాడి చేసి చేతులు కట్టేసి, ఇద్దరు వ్యక్తులను కాపాలా ఉంచారు. ఆ ఆరుగురు దుండగులు, ఊరి నుంచి మద్యం తెచ్చిన మరో యువకుడు, ఆ మొదటి ఇద్దరు కలిసి ఆ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Nagar Kurnool Woman Gang Rape: ఆ దుండగులు వరుసగా లైంగికదాడికి పాల్పడుతుండగా, దాహం వేస్తుందని ఆ యువతి వేడుకున్నది. దీంతో ఆ దుర్మార్గులు మూత్రం నోట్లో పోసి, వారు మద్యం తాగుతూ అమానుషానికి ఒడిగట్టారు. ఇలా తెల్లవారు జామున 3 గంటల వరకు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతి పుస్తెలతాడు, బంగారు చెవి దిద్దులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఆ బాధితురాలు తన బంధువు వద్దకు చేరుకొని చేతికున్న కట్లు విప్పింది. ఆ ఇద్దరూ కలిసి ఊర్కొండపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nagar Kurnool Woman Gang Rape: వివాహిత యువతిపై సామూహిక లైంగికదాడి ఘటనపై నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్పందించారు. సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని తరలించామని, ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, త్వరలోనే ఘటన వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు.

