Nagachaitanya:

Nagachaitanya: సమంత దూర‌మ‌య్యాక‌ మ‌రోసారి స్పందించిన నాగ‌చైత‌న్య‌

Nagachaitanya: న‌టుడు నాగ‌చైత‌న్య‌, న‌టి స‌మంత విడాకుల అంశం ఇప్ప‌టికీ నెటిజ‌న్ల‌లో ఓ ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తుంది. తాజాగా స‌మంత‌, ద‌ర్శ‌కుడు రాజ్ నిడ‌మోరును వివాహం చేసుకున్న‌ద‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమె ఓ ఆల‌యంలో ప్ర‌త్యేక పెళ్లి చేసుకున్నార‌ని, ఇద్ద‌రూ ఉంగ‌రాలు తొడుక్కున్న‌ట్టు ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇదే స‌మ‌యంలో ప‌లువురు ప‌లు ర‌కాలుగా వ్యాఖ్యానాలు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Nagachaitanya: ఇదే స‌మ‌యంలో తాజాగా నాగ‌చైత‌న్య ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విష‌యాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. 2021లో సమంత‌తో విడాకుల స‌మ‌యంలో చాలా మంది త‌న‌కు అఫైర్ ఉన్న‌ద‌ని నింద‌లు మోపార‌ని నాగ‌చైత‌న్య పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో విడాకుల త‌ర్వాతే తాము క‌లిశామ‌ని తాను, శోభిత ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

Nagachaitanya: అదే విధంగా ఓ సంబంధాన్ని బ్రేక్ చేయాలంటే 1000 సార్లు ఆలోచిస్తాన‌ని నాగ‌చైత‌న్య చెప్పారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న గాసిప్స్‌పై మ‌ళ్లీ వివ‌ర‌ణ ఇస్తే, దానిపైనా పుంఖాను పుంఖాలుగా వార్త‌లు కోడై కూస్తాయ‌ని పేర్కొన్నారు. అందుకే తాము రిజ‌ర్వ్‌గా ఉన్నట్టు చెప్పారు. తాము వ‌చ్చిన ఫ్యామిలీ నుంచి ఆ బాధ‌లు త‌న‌కు తెలుసు అని తెలిపారు. బ్రేక‌ప్ బాధేంటో త‌న‌కు తెలుస‌ని కూడా చెప్పుకొచ్చారు.

Nagachaitanya: తాజాగా దూత అనే వెబ్‌సిరీస్ రెండేళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా నాగ చైత‌న్య చేసిన ఓ పోస్టు కూడా వైర‌ల్‌గా మారింది. నిజాయితీగా ప‌నిచేస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీనిపైనా నెటిజన్లు విశేషంగా స్పందిస్తూ వ‌స్తున్నారు. చాలా మంది స‌మంత వ్య‌క్తిగ‌త జీవితంపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *