Nagababu:  “ఆడవాళ్లు ఏం ధరించాలనేది వారి ఇష్టం”

Nagababu: ఇటీవల దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులు, అందాల ప్రదర్శనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వారం గడిచినా వివాదం మాత్రం తగ్గకుండా రోజురోజుకూ మరింత ముదురుతోంది.

ఇప్పటికే చిన్మయి, అనసూయ వంటి ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించగా, ఈ అంశం మహిళా కమిషన్ వరకు చేరింది. అనంతరం శివాజీ స్వయంగా ముందుకు వచ్చి అసభ్య పదజాలం ఉపయోగించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు.

అయితే వివాదం సద్దుమణుగుతుందనుకున్న సమయంలో అది కాస్తా శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్లుగా మారింది. మీడియా కూడా ఈ అంశాన్ని నిరంతరం హైలైట్ చేస్తూ వార్తల్లో ఉంచుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్‌, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఈ వివాదంపై స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత ఇష్టమని, దానిపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని నాగబాబు స్పష్టం చేశారు.

ఇంకెన్నాళ్లు మహిళలపై పురుషులు ఇలాంటి వివక్ష కొనసాగిస్తారని ప్రశ్నించిన ఆయన, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నాగబాబు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *