Naga Chaitanya: తండేల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నాగచైతన్య, ఇప్పుడు NC24తో మరో స్థాయికి చేరుకోనున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు రూపొందిస్తున్న ఈ మైథాలాజికల్ థ్రిల్లర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. చైతూ ఈ చిత్రంలో ట్రెజర్ హంటర్‌గా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక, హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. సుకుమార్ రచన, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకోనుంది.
Also Read: Lenin: అఖిల్ ‘లెనిన్’ నుంచి సరికొత్త అప్డేట్? LENIN
అటు శివ నిర్వాణతో NC25 కోసం ప్లాన్ చేస్తూనే, తమిళ బ్లాక్బస్టర్ సర్ధార్ సినిమా దర్శకుడు పీఎస్ మిత్రన్‌తో మరో ప్రాజెక్ట్ కోసం చైతూ చర్చలు జరుపుతున్నాడు. గతంలో కస్టడీ, తండేల్ మధ్య గ్యాప్ తీసుకున్న చైతూ, ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి సారించి, పాన్-ఇండియా స్థాయిలో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.

