Thandel: సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరో రేంజిలో స్టార్ డం పొందిన హీరోయిన్ సాయి పల్లవి. అంతలా తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ. ఇక రీసెంట్‌గా ‘తండేల్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు, ఈ చిత్రంలోనూ సాయి పల్లవి తన నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్తుందని అందరూ భావించారు. నిజానికి ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకున్నాడు హీరో నాగచైతన్య. ఈ సినిమాలో చైతూ చేసిన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ సినిమా నిజంగా అక్కినేని అభిమానులకు స్పెషల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
