Naga Chaitanya-Sobhita: అక్కినేని అభిమానులు సంతోషపడే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమవుతోంది. అక్కినేని హీరో నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ తల్లిదండ్రులు కాబోతున్నారా అనేది ఆ వార్తల సరాంశం. శోభిత ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. అక్కినేని కుటుంబంలోకి త్వరలో ఒక పాప లేదా బాబు రాబోతున్నారని తెలిసి అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, నాగ చైతన్య శోభితతో ప్రేమలో ఉన్నాడు.
అనంతరం సింపుల్ గా అక్కినేని కుటుంబం, శోభిత కుటుంబం అంగీకారంతో వారి వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన అనేక విషయాలతో పాటు, వివాహ ఫోటోలు కూడా ట్రెండింగ్ గా మారాయి. వివాహం తర్వాత నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు. అక్కినేని ఇంట్లోకి కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ విషేశంగా, ప్రత్యేకమైన సందర్భమని అందరూ అన్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత, చైతు కొంత సమయం తీసుకుని తన కొత్త భాగస్వామితో హనీమూన్‌ను వెళ్లాడు. అదే సమయంలో, శోభిత గర్భవతి అనే వార్తతో అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే, ఈ విషయంపై అతని కుటుంబ సభ్యుల నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు.
ఇది కూడా చదవండి: Varuntej- Lavanya : మెగా ఫ్యామిలీలో గుడ్ న్యూస్: వరుణ్ తేజ్, లావణ్య తల్లిదండ్రులుగా మారనున్నారా?
శోభిత ధూళిపాళ తన కెరీర్‌లో అనేక అడ్డంకులను ఎదుర్కొని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. శోభితా ధూళిపాళ మే 31, 1992న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో ముంబైకి వెళ్లి తన కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచింది. శోభిత సినీ కెరీర్ చివరకు 2016లో ‘రామన్ రాఘవ్ 2.0’తో ప్రారంభమైంది. 2009లో, శోభిత అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత, అతను ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1, 2’ ‘ది నైట్ మేనేజర్’ చిత్రాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు.

