Naga Babu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో కేటాయించే శాఖలను నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నాగబాబును ఏపీ క్యాబినెట్‌లోకి తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణతో కలిసి నాగబాబుకు కేటాయించే బెర్త్ విషయమై, ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై చర్చించారు. ఈ చర్చల మేరకు నాగబాబుకు బెర్త్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది.
Naga Babu: ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇవే శాఖలు జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేశ్ వద్ద ఉన్నాయి. ఈ శాఖలను నాగబాబుకు కేటాయించి, దుర్గేశ్‌కు గనుల శాఖను ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో త్వరలో నాగబాబును మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.
