Nadendla manohar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. ప్రతిపక్ష హోదా అంశంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించగా, దానికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పవన్ వ్యాఖ్యలు: 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తే, జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అంటూ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రతిస్పందన: పవన్‌ను కార్పొరేటర్‌కు తక్కువ, ఎమ్మెల్యేకు ఎక్కువ అనే స్థాయిలో ఉంచారు.
నాదెండ్ల కౌంటర్: జగన్ వ్యాఖ్యలను “క్రిమినల్ మైండ్”తో చేసినవిగా అభివర్ణిస్తూ, “బాబాయ్ హత్యపై అందరికీ తెలిసిందే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నువ్వు కోడికత్తికి ఎక్కువ… గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా! నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు..
వర్క్ ఫ్రమ్ బెంగళూరు విమర్శ: జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా తరచూ బెంగళూరుకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ, ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యతలపై ప్రశ్నించారు.