Naari

Naari: మార్చి 7న జనం ముందుకు ‘నారి’

Naari: ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శశి వంటిపల్లి దీనిని నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, ”ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్ కు కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా ‘నారి’ సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? వారికి ఎలా సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. మార్చి 7న దీనిని విడుదల చేస్తున్నాం” అని అన్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ ను తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించి చిత్ర బృందాన్న అభినందించారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాత శశి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *