Naa Peru Shiva: కోలీవుడ్ స్టార్ సూర్య తమ్ముడు కార్తీని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన మూవీ నాపేరు శివ.. కాజల్ అగర్వాల్ హీరోయిన్. సుసీంద్రన్ డైరెక్టర్. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్. తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తో పాటు… మంచి కలెక్షన్స్ సాధించిన నా పేరు శివ ఇవాళ్టితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది.
Also Read: Raja Saab: రాజా సాబ్ వాయిదా.. అభిమానుల ఆందోళన!
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఎంతటి దుమారం రేపింది, హీరో దాన్నెలా సాల్వ్ చేశాడనే కథతో.. ఎమోషన్స్ హైలెట్ గా వచ్చిన ఈ మూవీలో కార్తీ నటన ఆకట్టుకుంటుంది. యువన్ శంకర్ రాజా సాంగ్స్ బాగుంటాయి. 2011 ఆగస్టు 5న రిలీజ్ అయిన నా పేరు శివ, ఈరోజుతో 14 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటోంది..