Mythri Movie Makers

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ తీరు భలే చిత్రంగుంది!?

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు పది పన్నెండు సినిమాలు వివిధ భాషల్లో నిర్మిస్తోంది. బయటి చిత్రాలతో ఆ సంస్థ నిర్మించే చిత్రాలు పోటీ పడటం అటుంచి… తమ చిత్రాలతో తామే పోటీ పడే పరిస్థితి కూడా ఈ సంస్థకు ఎదురవుతోంది. రెండేళ్ళ క్రితం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను ఒక్క రోజు గ్యాప్ తో ఈ సంస్థ విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరుగబోతోంది. పొంగల్ కు రావాల్సిన అజిత్ తమిళ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో సైతం డబ్ కాబోతోంది. అలానే ఇదే సంస్థ సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిందీలో ‘జాట్’ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 10నే విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. చిత్రం ఏమంటే… ‘జాట్‌’ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అవుతుందని తెలుస్తోంది. ఆ రకంగా పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mrunal Thakur: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్ 'పో పో' సాంగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *