Vizag Crime: విశాఖపట్నం బీమిలి బీచ్ రోడ్ కాపులుప్పాడలో గుర్తుతెలియని అస్థిపంజరం కనిపించడంతో ఒకేసారి అలజడి రేగింది. దాని చుట్టూ రుద్రాక్ష మాలలు, పసుపు, ఎరుపు పూసలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె వంటి వస్తువులు కనిపించాయి. ఈ ఆధారాల ద్వారా పోలీసులు మృతదేహాన్ని పెందుర్తికి చెందిన 50 ఏళ్ల జ్యోతిష్కుడు మోతి అప్పన్నగా గుర్తించారు.
హత్య వెనుక అసలు కారణం:
పోలీసుల దర్యాప్తులో ఇది హత్య అని తేలింది. మోతి అప్పన్న తన పరిచయస్తురాలైన మౌనికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త చిన్నారావు కోపంతో హత్యకు ప్లాన్ చేశాడు. మౌనికకు కొన్ని సమస్యలున్నాయని భావించి అప్పన్న ఆమెకు పూజలు చేయిస్తానని చెప్పాడు. అయితే, పూజల పేరుతో అతను అసభ్యంగా ప్రవర్తించాడని మౌనిక తన భర్తకు తెలిపింది. దీంతో, చిన్నారావు అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇది కూడా చదవండి: Hyderabad: తాజ్ బంజారా హోటల్ సీజ్.. షాకిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు
హత్యకు మార్గం:
చిన్నారావు తన బంధువుల ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం పూజ చేయించాలని నమ్మించి అప్పన్నను బోయపాలెం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బటన్ నైఫ్‌తో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసేందుకు టిన్నర్, పెట్రోల్ ఉపయోగించారు. హత్య సమయంలో చిన్నారావు చేతికి గాయమయ్యింది, దీంతో అతను కేజీహెచ్‌లో చికిత్స పొందాడు.
పోలీసుల విచారణ:
అప్పన్న అదృశ్యం విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆనందపురం, భీమిలి పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి, చిన్నారావు, మౌనికను అరెస్టు చేశారు.

