Mystery Dead Bodies: ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే కొప్పరు లో జరిగింది. కడుపులో కత్తికళ్ళు చేతులు కట్టేసి…ఓ డెడ్ బాడీ కొట్టుకు వచ్చింది. అలా వచ్చిన ఆ బాడీ ని చూసి అక్కడ ప్రజలు అమ్మో అంటూ పరుగులు తీశారు. అది అలా ఉంటె …నంద్యాలలో పొలాల్లో మరో బాడీ . కొట్టుకు వచ్చిన బాడీ ఎవరిదో తెలియదు. పొలాల్లో దొరికిన మృతదేహం కూడా ఎవరిదో తెలియదు/. మిస్టరీ బాడీస్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ననసాపురం మండలం కొప్పరులో చోటుచేసుకుంది. పొట్టలో కత్తి పోటుతో పాటు కాళ్లు కట్టేసిన మృతదేహం కొప్పర్రు గ్రామం వద్దకు కొట్టుకువచ్చింది. పథకం ప్రకారం హత్య చేసి కాల్వలో పడేసి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Doctor Praneetha: పుట్టినరోజునే..లైవ్ లో మహిళా డాక్టర్ సూసైడ్ అటెంప్ట్..!
Mystery Dead Bodies: రూరల్ ఎస్‌ఐ వెంకట సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లు మండలం వెలివెలి నుంచి మొగల్తూరు మండలం శేరేపాలెం వెళ్లే పంట కాల్వలో కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ సమాచారాన్ని వీఆర్వోకు తెలియజేశారు. వీఆర్వో నాగేంద్ర సంఘటన స్థలాన్ని సందర్శించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీయగా కాళ్లు కట్టేసి, పొట్టలో కత్తిపోటు గాయాలున్నాయి. హత్యచేసి కాల్వలో పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఎక్కువ రోజులు నీళ్లలో ఉండడం వల్ల కుళ్లిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. డీఎస్పీ శ్రీవేద, రూరల్ సీఐ దుర్గాప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ వెంకట సురేష్ తెలిపారు.
మరోవైపు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రమఠం గ్రామానికి చెందిన కొమ్ము శేఖర్ తన పొలానికి వెళ్లగా శవం కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.