Mushrooms Uses

Mushroom Health Benefits: పుట్టగొడుగులతో గుండెజబ్బులు, క్యాన్సర్ కు చెక్..

Mushroom Health Benefits: పుట్టగొడుగులు అంటే కొంతమందికి నచ్చవు. వాటికి రుచి అస్సలు ఉండదని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వీటిని మన ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఇవి మనం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పుట్టగొడుగులు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. మీరు ప్రతిరోజూ తినలేకపోయినా, కనీసం వారానికి ఒకసారి తినడానికి ప్రయత్నించాలి. మరి మీరు వీటిని ఎందుకు తినాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..

పుట్టగొడుగుల వల్ల కలిగే ప్రయోజనాలు:

పుట్టగొడుగులలో లభించే యాంటీఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి.

పుట్టగొడుగులలో లభించే సహజ పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

పుట్టగొడుగులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు చాలా మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటారు. ఇది క్రమంగా బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

పుట్టగొడుగులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Mobile Addiction: మీ పిల్లలు మొబైల్ ఫోన్ లేకుండా తినరా?

ఈ పుట్టగొడుగులు శరీరాన్ని డీటాక్స్ చేయడానికి సహాయపడతాయి. ఇది చెడు పదార్థాలను త్వరగా తొలగించడం ద్వారా పనిచేస్తుంది.

పుట్టగొడుగులలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. జుట్టు అందంగా పెరగడానికి సహాయపడతాయి.

పుట్టగొడుగులలో లభించే యాంటీఆక్సిడెంట్ ఎర్గోథియోనిన్ క్యాన్సర్‌ను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 18 గ్రాముల పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 45శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

పుట్టగొడుగులలో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే బీటా-గ్లూకాన్ మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *