Murder Cases:ఇది ఒళ్లు గగుర్పొడిచే సమాచారం.. ఇది జాతీయ నేర రికార్డుల ప్రకారం వెల్లడైంది.. భార్యల చేతిలో గత ఐదేండ్లలో దారుణంగా హత్యకు గురైన భర్తల సంఖ్య తేటతెల్లమైంది. ఈ రికార్డులను చూస్తూ ఆందోళన కలిగించకమానదు. ఇటీవల ఈ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటం మరింత గుబులు కలిగిస్తున్నది.
Murder Cases:ఈ వార్త బయటకు వచ్చే నాటికి తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో కారుతో బైక్‌పై వెళ్తున్న భర్తను గుద్దిచ్చి భార్య సుపారీ గ్యాంగ్‌తో చంపించిన వైనం బయటకొచ్చింది. ఇటీవలే గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్‌ను తన భార్య ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేయించి దారుణంగా హత్య చేయించింది.
Murder Cases:దేశవ్యాప్తంగా 2020వ సంవత్సరం నుంచి 2024 నాటికి దేశవ్యాప్తంగా 785 మంది భర్తలు తమ భార్యల చేతిలో హతమయ్యారని జాతీయ నేర రికార్డుల ప్రకారం వెల్లడైంది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు వరుస మరణాలు చోటుచేసుకున్నాయి.
Murder Cases:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 45 మంది భర్తలు తమ భార్యల చేతిలో చనిపోయారు. 2021లో ఈ సంఖ్య 52కు చేరుకోగా, 2022లో 60కి చేరింది. 2023లో 55, 2024లో 62 హత్యలుగా నమోదయ్యాయి. అదే విధంగా బీహార్ రాష్ట్రంలో 2020లో 30, 2021లో 35, 2022లో 40, 2023లో 39, 2024లో 42 మంది చొప్పున భర్తలు తమ తమ భార్యల చేతిలో హతమయ్యారు.
Murder Cases:రాజస్థాన్ రాష్ట్రంలో 2020లో 20, 2021లో 25, 2022లో 28, 2023లో 30, 2024లో 35 మంది చొప్పున భర్తలు హత్యకు గురయ్యారు. మహారాష్ట్రలో 2020లో 15, 2021లో 18, 2022లో 20, 2023లో 22, 2024లో 25 మంది భర్తలు హతమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 12 మంది, 2021లో 15, 2022లో 18, 2023లో 20, 2024లో 22 మంది చొప్పున భర్తలు తమ భార్యల చేతిలో అమానుష హత్యలకు గురయ్యారు.
