Murder Case:హైదరాబాద్ మలక్‌పేట శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. తొలుత గుండెపోటుతో చనిపోయిందని, ఆమె కుటుంబ సభ్యులకు శరీష భర్త ఫోన్ చేశాడు. ఆ తర్వాత వారి హైదరాబాద్ రాకముందే అచ్చంపేట సమీపంలోని దోమలపెంట గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఈ విషయం సంచలనంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి దోమలపెంటలో అంబులెన్స్ నిలిపి మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె శరీరంపై గాయాలుండటంతో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
Murder Case:శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్, ఆయన సోదరి కలిసి హత్య చేసినట్టు తేలింది. తన అక్క మాట వినకుండా శిరీష ఎదురు తిరుగుతుందని, ఆమె కోసమే శిరీషను వినయ్ దారుణంగా చంపినట్టు వెల్లడైంది. తొలుత శిరీషకు మత్తు మందు ఇచ్చి హత్య చేశాడు. స్పృహ కోల్పోయాక కూడా బతుకుతుందేమోనని ఊపిరాడకుండా చేసిన వినయ్ భార్యను ఘోరంగా చంపేశాడు. ఆ తర్వాత వినయ్ ఏమీ ఎరగనట్టే గుండెపోటుతో చనిపోయిందంటూ నాటకం రక్తి కట్టించబోయాడు. కానీ, శిరీష శరీరంపై గాయాలు, పోస్టుమార్టం ద్వారా అసలు విషయాలు బయటపడ్డాయి.
Murder Case:ఆ తర్వాత శిరీష గుండెపోటుతో చనిపోయిందని ఆమె మేనమామకు నిందితుడు వినయ్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే మృతదేహాన్ని అక్కడే ఉంచాలని, తాము వస్తున్నామని వినయ్‌కు శిరీష మేనమామ చెప్పాడు. కానీ, ఈ లోగా శిరీష మేనమామ వచ్చేంతలోగా డెడ్‌బాడీని వినయ్ తరలించాడు. సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్‌ను ట్రేస్ చేసిన శిరీష మేనమామ పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దోమలపెంట వద్ద పోలీసులు ఆ అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు నిందితులుగా వినయ్, అతని సోదరిని పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం సోదరి మాట వినడం లేదని, కట్టుకున్న భార్యనే కడతేర్చిన వినయ్ ఇప్పుడు కటకటాలను లెక్కించాల్సిన దుస్థితి వచ్చింది.

