Murder Case: సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడి హత్య కేసు విషయంపై విచారించిన పోలీస్ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇది జరిగిన వారంలోపే డీఎస్పీ, సీఐ, ఎస్ఐపై వేటు పడింది. ఈ హత్య ఘటనకు ముందే అందిన ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Murder Case: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్‌ను గ్రామంలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సొంత అల్లుండ్లనే ఈ హత్య కేసులో నిందితులుగా పోలీసులు గుర్తించారు. నలుగురు కూతుళ్లలో ముగ్గురు కూతుళ్లను అదే గ్రామంలో ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ కూతుళ్లు, అల్లుండ్లే చక్రయ్యను హతమార్చాలని నిర్ణయంచుకున్నారని కేసు విచారణపై తేల్చారు.
Murder Case: గ్రామంలో గత 30 ఏండ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న చక్రయ్యగౌడ్ వల్ల తమకు రాజకీయ ఎదుగుదల లేకుండా పోయిందని సొంత అల్లుడే భావించాడు. దీంతోనే ఆయన అడ్డు తొలగించుకోవాలని ఈ ప్లాన్ చేశాడని, ఈ కేసులో సొంత కూతురు, అల్లుడు సహా 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Murder Case: ఈ హత్యా ఘటనకు ముందే మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, హత్యకు ప్లాన్ చేస్తున్నారని ముందుగానే పోలీసులకు చక్రయ్యగౌడ్ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. వారు అనుమానించినట్టుగానే సొంత కూతురు, అల్లుడే ఈ హత్యకు ప్లాన్ చేశాడని తేలింది.
Murder Case: ఈ హత్యకు ముందు తమ విన్నపాన్ని పట్టించుకోలేదన్న మెంచు చక్రయ్య గౌడ్ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారించారు. దీంతో పోలీసు అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించారని సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐపై బదిలీ వేటు వేశారు. ఎస్ఐకి మెమో జారీ చేశారు. వారిద్దరినీ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.