Murder Case: హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట శాలివాహననగర్‌లో మంగళవారం (జూలై 15) జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందునాయక్ (47) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్య ఆర్థిక లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Murder Case: హతుడు చందునాయక్ హత్య కేసులో రాజేశ్, శివతోపాటు మరో ఇద్దరు ఎస్వీటీ పోలీసులు ఎదుట మంగళవారం మధ్యాహ్నం లొంగిపోయారు. చందునాయక్‌తోపాటు నలుగురు నిందితులు ఓ హత్య కేసులో నిందితులు. ఆ ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.
Murder Case: నాగోల్ సాయినగర్‌లో గుడిసెలకు సంబంధించి నాలుగేళ్ల క్రితం గొడవ చోటుచేసుకున్నది. ఈ గొడవ విభేదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం చందునాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కీ నిర్వహించారు. అతను ఇంటి నుంచి శాలివాహననగర్‌కు వెళ్లున్న చందునాయక్‌ను ఆ దండగులు అనుసరించారు. పార్క్ నుంచి బయటకు రాగానే చందునాయక్‌పై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. హతుడైన చందునాయక్ గతంలో చాలా చోట్ల భూతగాదాలను పరిష్కరించినట్టు తెలుస్తున్నది.
