Murder Case: హైదరాబాద్ మీర్‌పేటలో జరిగిన మహిళ మర్డర్ కేసును తెలంగాణలోనే అరుదైన కేసుగా పోలీసు శాఖ గుర్తించింది. ఇలాంటి ఘటనలు దేశంలో మరెక్కడైనా జరిగాయా? అని ఆరా పోలీసు అధికారులు తీస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు వివరాలను ఇంతవరకూ వెల్లడించలేకపోయారు. నిందితుడు తాను ఈ హత్య చేశానని చెప్పుకుంటున్నా, సరైన ఆధారాలు లభ్యంకాక జాప్యం జరుగుతున్నది.
Murder Case: మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెంకటమాధవిని రిటైర్డ్ ఆర్మీ అయిన ఆమె భర్త గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజే హత్య చేశాడు. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. తన భార్యను తానే హత్య చేశానని, కుక్కర్లో ఉడకబెట్టానని, శరీర భాగాలను మీర్‌పేట చెరువులో పడేశానని చెప్పాడు. అయితే ఆ చెరువులో వెతికిన పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను రెండు సార్లు చేశారు.
Murder Case: ఇంటిలోని రక్తపు మరకలను ఫోరెన్సిక్ నిపుణులతో సేకరించి ల్యాబ్‌కు పంపారు. వాటిని పిల్లల డీఎన్ఏతో పోల్చి చూడొచ్చని భావించారు. పిల్లల నుంచి కూడా వివరాలు సేకరించారు. పండుగ తర్వాత ఇంటి నుంచి దుర్వాసన వచ్చిందని పోలీసులకు పిల్లలు చెప్పినట్టు తెలిసింది. అయినా ఆధారాలు లేకుండా చేయడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
Murder Case: అందుకే వెంకటమాధవి హత్య కేసును పోలీసులు అరుదైన కేసుగా గుర్తించారు. దేశంలో మరెక్కడైనా ఈ తరహాలో జరిగిన మర్డర్ కేసులను పరిశీలిస్తున్నారు. వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన కేసులను దర్యాప్తు చేసిన పోలీస్ బృందాల సాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లనూ పోలీసులు సంప్రదిస్తున్నట్టు సమాచారం.