Municipal Elections: తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది.
