Muncipal Elections: పట్టణవాసులు ఎప్పుడెప్పుడా అని తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజే (జనవరి 27న) నగారా మోగనున్నది. ఈ మేరకు 27న సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నది. ఇప్పటికే ముందస్తు ప్రక్రియను పూర్తి చేసి.. జిల్లాల ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు.
Muncipal Elections: రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 27న మధ్యాహ్నంలోగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావుతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.
Muncipal Elections: ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాలు సిద్ధమయ్యాయి. అదే విధంగా బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధంగా ఉంచారు. మొత్తంగా ఫిబ్రవరి 15లోగా ఎన్నికల ప్రక్రియను అంతా ముగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది.
