Muncipal Elections:

Muncipal Elections: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మీరు పోటీ చేయాల‌ని భావిస్తున్నారా? ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!

Muncipal Elections:రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న‌ది. నేడో, రేపో ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. ఇప్ప‌టికే మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ఓట‌ర్ల జాబితాల‌ను సిద్ధం చేసి ఉంచారు. రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేశారు. దీంతో ఎప్పుడు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైనా ప్ర‌క్రియ‌ను చేప‌ట్టేందుకు రాష్ట్ర‌ ఎన్నికల సంఘం సిద్ధంగానే ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్లుగా, కౌన్సిల‌ర్లుగా పోటీచేసే అభ్య‌ర్థులు, పార్టీల వారీగా, స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీచేసే వారు ఈ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మైన ఈ నియ‌మ నిబంధ‌న‌లు తెలుసుకోవాల్సిందే.

పోటీకి ఎవ‌రు అర్హులు
1) భార‌త పౌరుడై ఉండాలి.
2) క‌నీసం 21 సంవ‌త్స‌రాల వ‌య‌సు పూర్త‌యి ఉండాలి
3) సంబంధిత మున్సిపల్‌, కార్పొరేష‌న్‌లో ఓట‌రై ఉండాలి
4) ఏ కోర్టు నుంచి కానీ అన‌ర్హ‌త ఆదేశాలు జారీ అయి ఉండ‌రాదు.

పార్టీ త‌ర‌ఫున పోటీచేసే అభ్య‌ర్థుల‌కు కావాల్సిన అంశాలు
1) పార్టీ నుంచి బీ ఫామ్ స‌మ‌ర్పించాలి
2) బ‌ల‌ప‌రిచే ఓట‌ర్లు ఒక్క‌రున్నా చాలు
3) పార్టీకి చెందిన ఎన్నిక‌ల గుర్తు ఎన్నిక‌ల గుర్తుగా వ‌స్తుంది.
4) నామినేష‌న్ ఫామ్ మ‌రియు అఫిడ‌విట్ స‌మ‌ర్పించాలి

స్వ‌తంత్ర అభ్య‌ర్థులకు ఏమికావాలి?
1) బ‌ల‌ప‌రిచే వారు 10 మంది ఉండాలి. వారు ఆ అభ్య‌ర్థి పోటీచేసే వార్డుకు చెందిన వారై ఉండాలి
2) పార్టీ గుర్తు ఉండ‌దు.
3) ఎన్నిక‌ల అధికారి ఇచ్చే ఫ్రీ సింబ‌ల్ ఎంచుకోవాలి.
4) నామినేష‌న్ మరియు అఫిడ‌విట్ స‌మ‌ర్పించాలి.

నామినేష‌న్ వేసేందుకు కావాల్సిన ప‌త్రాలు
1) ఎన్నిక‌ల అధికారి నుంచి పొందిన నామినేష‌న్ ఫామ్
2) అఫిడ‌విట్ (ఆస్తులు, కేసుల వివ‌రాలు)
3) పోటీ చేయు అభ్య‌ర్థి ఓట‌రు గుర్తింపు కార్డు/ ఆధార్ కార్డు
4) అవ‌స‌రం మేర‌కు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు
5) పార్టీ అభ్య‌ర్థి అయితే ఆ పార్టీ బీ ఫామ్‌
6) ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న ప్ర‌కారం డిపాజిట్‌
7) ఓట్లు త‌క్కువ‌గా వ‌స్తే డిపాజిట్ జ‌ప్తు అవుతుంది

ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు ప‌రిమితి
1) న‌గ‌ర పంచాయ‌తీలు – 2 ల‌క్ష‌లు
2) గ్రేడ్-3 మున్సిపాలిటీ – 3 ల‌క్ష‌లు
3) గ్రేడ్-2 మున్సిపాలిటీ – 4 ల‌క్ష‌లు
4) గ్రేడ్‌-1 మున్సిపాలిటీ – 5 ల‌క్ష‌లు
5) మున్సిప‌ల్ కార్పొరేష‌న్ – 10 ల‌క్ష‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *