Muncipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలింది. ఆ వెంటనే ప్రచారం షురూ అయింది. ఈ మేరకు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, 7 కార్పొరేషన్ల డివిజన్ల పరిధిలో 12,993 మంది పోటీలో నిలిచారు. ఆయా అర్బన్ లోకల్ బాడీ (యూఎల్బీ)ల్లో 2996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. వాటి కోసం 20,313 మంది అభ్యర్థులు 29,694 నామినేషన్లను దాఖలు చేశారు.
Muncipal Elections 2026: మొత్తం నామినేషన్లలో 10,084 నామినేషన్లు స్క్రూటినీలో వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 19,610 నామినేషన్లు చెల్లుబాటు అయినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ల తిరస్కరణ అనంతరం 6,701 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 2996 వార్డులు, డివిజన్లలో 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Muncipal Elections 2026: వార్డులు, డివిజన్లలో పోటీ చేసిన అభ్యర్థుల్లో పార్టీల బీఫామ్ ఇచ్చిన వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. 2018 నాటి ఉత్తర్వుల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ కేటాయించారు. పోటీ ఉన్నచోట డ్రా పద్ధతిన ఆయా గుర్తులను కేటాయించారు. ఆ తర్వాత వెంటనే నిన్నటి నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటి ప్రచారం కొనసాగుతున్నది. దీంతోపాటు సోషల్ మీడియా ప్రచారంతో అన్ని వేదికలు మార్మోగుతున్నాయి.
