Mumbai: గిన్నీస్ రికార్డ్ సాధించిన ముంబై స్టేడియం

Mumbai: ముంబై క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. వాంఖడే స్టేడియంలో క్రికెట్ బంతులతో 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. స్టేడియంలో 14,505 బంతులతో “ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం” అని రాసింది. ఈ కార్యక్రమానికి ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించారు. 1975లో వెస్టిండీస్‌తో వాంఖడే స్టేడియంలో తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది. 14 వేల క్రికెట్ బంతులతో 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది.

ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్ ఈ అంశంపై సోషియల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ప్లేయర్ ఏకనాథ్ సోల్కర్ మరియు మాజీ ముంబై ఆటగాళ్ల స్మారకంగా నిర్వహించామని చెప్పారు. 1975లో జరిగిన ఈ మ్యాచ్‌లో సోల్కర్ సెంచరీ సాధించారు. ఆ మ్యాచ్ జనవరి 23 నుండి 29 వరకు జరిగింది. స్కూళ్లు, క్లబ్స్, ఎన్జీవోలకు చెందిన యువ క్రికెటర్లకు ఈ బంతులను కానుకగా ఇవ్వనున్నట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ వెల్లడించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IPL 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌గా కింగ్ కోహ్లీనే.. హింట్ ఇచ్చేసిన ధోని క్లోజ్ ఫ్రెండ్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *