Mumbai

Mumbai: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

Mumbai: ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. వీటి గురించి పోలీసులు, అధికారులు ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా ఈ డిజిటల్ మోసాల బారిన పడుతున్నారు. ఎందరో కోట్లు డబ్బును పొగోట్టుకుంటున్నారు. అయితే ముంబైలోనూ తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిజిటల్ అరెస్టు పేరుతో ముంబైలోని ఓ యువతి బట్టలు విప్పించారు. మనీలాండరింగ్‌లో మీ పేరుందని కొందరు సైబర నేరగాళ్లు ఓ యువతికి కాల్ చేశారు. దీంతో ఆ యువతి భయపడటంతో గుర్తించిన వారు ఆమె దగ్గర నుంచి రూ.1.78 లక్షలు కొట్టేశారు.

Mumbai: అంతటితో ఆగకుండా ఆమెను డిజిటల్ అరెస్టు చేశారు. దీనికోసం హోటల్‌లో రూమ్ తీసుకుని వీడియో కాల్ చేయమన్నారు. కేటుగాళ్ల మాటలు నమ్మిన ఆ యువతి చెప్పినట్లు చేసింది. మనీలాండరింగ్ కేసు నుంచి బయటపడాలంటే బాడీ మొత్తం వెరిఫికేషన్ చేయాలని బట్టలు విప్పించారు. పదే పదే ఆమెను బలవంతం చేయడంతో డౌట్ వచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Mumbai: ఇదిలా ఉండగా.. పెరుగుతున్న సైబర్ నేరాలు, అలాగే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కానిస్టేబుళ్ల స్థాయిలోనే టెక్నాలజీ వినియోగించి వాళ్లపై పనిభారాన్ని తగ్గించాలంటూ సూచనలు చేస్తున్నారు. ఈ సదస్సులో దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిగాయి.మావోయిస్టుల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, మహిళలపై జరుగుతున్న హత్యాచారాల నియంత్రణ, జలమార్గంలో సమర్ధ బందోబస్తుకు సంబంధించి తీర్మానాలు కూడా జరిగాయి. జరుగుతున్న అక్రమాలు, డీప్‌ఫేక్ వంటి వాటిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆదివారం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Traffic Challan Rule: చలాన్‌ కట్టలేదా.. ఇపుడు వాటికీ కూడా చలాన్‌ కటాలసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *