Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ సినీ రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె ఆరు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇందులో రెండు తెలుగు, నాలుగు హిందీ చిత్రాలు ఉన్నాయి. అజయ్ దేవగన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘సన్నాఫ్ సర్దార్ 2’ ఆమె కీలక చిత్రం. తెలుగు హిట్ ‘మర్యాద రామన్న’ ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ కామెడీ సీక్వెల్‌లో మృణాల్ పంజాబీ యువతిగా కనిపించనుంది. ఈ చిత్రం జూలై 25న విడుదల కానుంది. ఇక హిందీలో ‘హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై’, ‘తుమ్ హోతో’, ‘పూజా మేరీ జాన్’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’, అల్లు అర్జున్‌తో అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణెతో కలిసి మృణాల్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రెండు ఇండస్ట్రీల్లోనూ సమతూకంతో సాగుతున్న మృణాల్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
