Mallu Ravi

Mallu Ravi: మంత్రి జూపల్లిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం!

Mallu Ravi: కొల్లాపూర్‌లో జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగ సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా, ఆయన ప్రసంగాన్ని తొందరగా ముగించమని రాసిన ఒక చీటీని ఒక కాంగ్రెస్ నాయకుడు తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో మల్లు రవి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, నేరుగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై మండిపడ్డారు.

“నేను సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా?” అంటూ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, “జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదు.. ఢిల్లీలో జరిగే ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nagarjuna Sagar Dam: సాగ‌ర్ డ్యాం భ‌ద్ర‌త ఇక నుంచి ఎస్పీఎఫ్ బ‌ల‌గాల‌దే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *