Parliament

Parliament: ఎంపీల మధ్య తోపులాట.. ఇద్దరు సభ్యులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం..

Parliament: పార్లమెంటు కాంప్లెక్స్‌లో గురువారం ఉదయం జరిగిన గొడవలో ఒడిశాలోని బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. తనను  రాహుల్ గాంధీ తోసేశారని సారంగి ఆరోపించారు.

సారంగి తలపై రుమాలు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. తలపై నుంచి రక్తం కారుతోంది. సారంగితో పాటు ఫరూఖాబాద్ బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు. సారంగి,ముఖేష్ రాజ్‌పుత్ ఇద్దరూ రామ్ మనోహర్ లోహియాలో చేరారు. ఐసీయూలో ఉన్న ముఖేష్ పరిస్థితి విషమంగా ఉంది.

ఈ గొడవపై రాహుల్‌ను ప్రశ్నించగా, ఆయన బీజేపీ ఎంపీలపై నిందలు వేశారు. బీజేపీ ఎంపీలు తనను పార్లమెంట్‌లోకి రాకుండా అడ్డుకుని, బెదిరించి నెట్టారని రాహుల్ అన్నారు. తనపై, ప్రియాంకపై అసభ్యంగా ప్రవర్తించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన మోకాలికి కూడా గాయమైందని ఖర్గే చెప్పారు.

ఇది కూడా చదవండి: Aam Aadmi Party: హామీ అదిరింది.. 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత వైద్యం

Parliament: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ- రాహుల్‌ ప్రతిపక్ష నేత, కుస్తీ పట్టాల్సిన అవసరం ఏముందన్నారు. ఇతరులను చంపేందుకు కరాటే నేర్చుకున్నాడు అంటూ విరుచుకు పడ్డారు. 

ఈ మొత్తం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం అందించారు. బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అమిత్ షా ప్రకటనపై పార్లమెంట్ లో గందరగోళం

అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై వరుసగా రెండో రోజు గురువారం కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుమారం రేగింది. ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నీలం రంగు దుస్తులు ధరించి వచ్చారు.

డిసెంబర్ 17న రాజ్యసభలో షా మాట్లాడుతూ – ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌గా మారింది. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్… మీరు భగవంతుని పేరును అంతగా పెట్టుకుని ఉంటే, మీరు 7 జన్మల పాటు స్వర్గానికి వెళ్లి ఉండేవారు. ఈ ప్రకటన అంబేద్కర్‌ను అవమానించడమేనని, షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Narendra Modi: హర్యానా ప్రజలు మోడీకి విషం పెట్టి చంపేస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *