CM Ramesh: పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు టిడిపి ఇన్చార్జ్ గండి బాబ్జి పాల్గొన్నారు సుమారు లక్ష కోట్లతో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అనకాపల్లి ఎంపీ, సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బంగారమ్మ పాలెం, ఆరిపాక, టెక్కలి పాలెం, నారుపాడు, గాలి భీమవరం , వంగలి, అంతకాపల్లి, మరియు గొట్టివాడ పంచాయతీల్లో జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం గొట్టివాడ సర్పంచ్లు సాలాపు మీన వెంకటేశ్వరరావు అధ్యక్షతన, బిఎస్ఎన్ఎల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరుగుతున్న పల్లె పండగ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి 100 శాతం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతేకాక లక్ష కోట్లతో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేపట్టడం జరిగిందని విశాఖ చెన్నై నాలుగు లైన్ల నిర్మాణాలతోపాటు విశాఖ జోనల్ కార్యాలయం నిర్మించడానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు.
ఇకపై రైల్వేస్టేషన్లో అన్ని రకాల సదుపాయాలతో సరికొత్త హంగులతో రూపు దిద్దడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడే దుస్థితి నెలకొంటుందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
