ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని విమర్శించారు.
కొందరికి రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్ వాళ్లు వారిని వెతికి పట్టుకొని తమ సోషల్ మీడియాలో అసలు రుణమాఫీనే జరగలేదని అబద్దాలు చెప్పిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని చెరువులు కుంటలు కబ్జాకు గురైతే.. వాటి మీద హైడ్రా తీసుకుంటున్న యాక్షన్ ను యాక్టర్లు కేటీఆర్, హారీష్ రావు, అప్పుడప్పుడు బీజేపీ నాయకులు తప్పు బట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.