Mp bharath: విశాఖ నగర అభివృద్ధిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుండటంపై టీడీపీ ఎంపీ భరత్ తీవ్రంగా స్పందించారు. టీసీఎస్ కంపెనీకి నామమాత్ర ధరకు భూములు కేటాయించారని వైసీపీ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. టీసీఎస్ విశాఖకు రావడం వల్లే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని, ఈ అవకాశాన్ని ఎదుర్కోలేకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారని విమర్శించారు.
“వైసీపీ నేతలకు యువత భవిష్యత్తుపై దయలేదా?” అంటూ ప్రశ్నించిన భరత్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో మరికొన్ని కంపెనీలు కూడా విశాఖ వైపు అడుగులు వేయనున్నాయని తెలిపారు. టీసీఎస్‌కు భూములివ్వకపోతే, వారు విశాఖకు వచ్చే అవకాశమే లేకపోయేదని వివరించారు.
ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ ప్రయోజనాల కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తే, ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రాకపోవచ్చని హెచ్చరించారు.

