MP Bharat

MP Bharat: తేజస్విని యాడ్ పై స్పందించిన భారత్..

MP Bharat: ఇటీవల ఒక ప్రముఖ జువెలరీ యాడ్‌లో కనిపించిన ఎంపీ భరత్ భార్య తేజస్విని మోడలింగ్ ఎంట్రీపై ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ స్పందించారు. తన భార్య మోడలింగ్ రంగంలోకి రావడం వెనుక ఉన్న కారణాలను ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహా గ్రూప్ సంస్థల సీఎండీ మారెళ్ల వంశీ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ‘రైజింగ్ ఏపీ మహా కాన్‌క్లేవ్’ ప్రోగ్రాంలో ఏపీ విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్ ఈ విషయం పైన స్పందించారు.

ఇది కూడా చదవండి: Mahaa Conclave: ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యం..ఎంపీ భరత్

కుటుంబ బాధ్యతల కారణంగానే తేజస్విని ఈ రంగంలోకి రాలేకపోయారు” అని భరత్ తెలిపారు. గతంలో మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఆమె కెరీర్‌ను వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పిల్లాడు పెద్దవాడు కావడంతో ఆమె ఈ ఫీల్డ్‌లోకి వచ్చారు అని భరత్ వెల్లడించారు.

తమ వ్యక్తిగత ఆసక్తి మరియు అభిరుచిని వృత్తిగా మార్చుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని తన భార్య సద్వినియోగం చేసుకుంటున్నారని ఎంపీ భరత్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *