Maharashtra

Maharashtra: కోర్టు ఆవరణలోనే కొట్టుకున్న అత్తాకోడళ్లు

Maharashtra: మేము ఇంతే . అక్కడ ఇక్కడ అని తేడా లేదు. అత్త , కోడలు…ఇద్దరు మల యుద్దపు వీరమనులే. కొట్టుకున్నారు …కోర్టుకు వచ్చిన మరి కొట్టుకున్నారు . అబ్బో ఆ కొట్టుకోవడం చూసి ఎవరైనా …ఎంత కోపం ఉందొ ఒకరిపై ఒకరికి అని. ఎవరు ఏమి అనుకున్నా …కానీ …ఆ కొట్టుడు మాత్రం..వేరే లెవెల్. ఓ అత్త ..ఓ కోడలు..ఇంటిల్లి పాది ఫైటింగ్ @ కోర్ట్. ఆలస్యం దేనికి మీరు చూడండి

అత్తాకోడళ్ల పంచాయితీ అంటే ప్రతీ ఇంట్లోనూ ఉండేదే. ఇంట్లో ఒకరిని మరొకరు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా.. బయటి వాళ్ల ముందు మాత్రం.. తల్లీకూతుళ్ల లాగా ఉంటారు. అయితే ఇలాంటి అత్తాకోడళ్ల గొడవలనే సీరియల్‌లు తీస్తుంటే.. అవి వేల కొద్ది ఎపిసోడ్‌లు, సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. కానీ ఈ అత్తాకోడళ్ల పంచాయితీ మాత్రం రోడ్డెక్కింది.

ఏకంగా కోర్టు ఆవరణలోనే ఆ అత్తాకోడళ్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఆవేశంతో ఒకరిపై మరొకరు రెచ్చిపోయి మరీ.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అయితే వాళ్లు కొట్టుకునే రేంజ్ చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో కోర్టు ముందు అత్తాకోడళ్ల గొడవ చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. ఒకరిపై మరొకరు ఇష్టం వచ్చినట్లు దాడి చేసుకున్నారు. వారు అలా కొట్టుకుంటూ ఉంటుంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు తిట్ల వర్షం కురిపించుకున్నారు.

Also Read: Hyderabad: అయ్యో భగవంతుడా.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి

కోర్టు గేటు ముందే.. రెండు కుటుంబాలకు చెందిన వారు వీర లెవల్‌లో రెచ్చిపోయారు. ఆడ, మగ తేడా లేకుండా విపరీతంగా దాడి చేసుకున్నారు. ఒకరి సిగలు మరొకరు పట్టుకుని.. కింద, మీద పడుకుంటూ కొట్టుకున్నారు. అందులో ఆడవాళ్లను మగవాళ్లు.. మగవాళ్లను ఆడవాళ్లు.. మగవాళ్లను మగవాళ్లు.. ఆడవాళ్లను ఆడవాళ్లు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే అక్కడ ఈ గొడవను చూస్తున్న స్థానికులు, లాయర్లు, కోర్టు సిబ్బంది.. షాక్‌కు గురయ్యారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆ రెండు వర్గాలను విడదీసే వరకు తన్నుకుంటూనే ఉన్నారు. ఇక ఈ గొడవలో రెండు వర్గాలు బాగా కొట్టుకున్నాయి. ఇందులో ఒకరి బట్టలు మరొకరు చించుకున్నారు. ఓవైపు కొట్టుకుంటూనే.. మరోవైపు వారంతా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక గొడవ సమయంలో ఒకరిపై మరొకరు పడి, కూర్చోని కొట్లాటకు దిగారు. వీరు పక్కనే ఉన్న వాహనాలపై పడటంతో అవి కూడా కిందపడిపోయాయి.

అయితే ఈ గొడవ చూసిన స్థానికులు.. అత్త, కోడళ్ల మధ్య ఎంత పెద్ద వివాదాలు ఉన్నా.. మరీ నడిరోడ్డుపై, అదీ కోర్టు ముందే ఈ రేంజ్‌లో కొట్టుకోవడం చూసి షాక్ అవుతున్నారు. చివరికి స్థానిక పోలీసులు వచ్చి.. జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *