Secunderabad: ఆ ఇద్దరిపై అత్యంత దారుణంగా దాడి. దాడి చేసి పంపేయాలి అనేది ప్లాన్. తల్లి కొడుకుపై కక్ష కట్టి..కత్తులతో పొడిచారు అంటే …కారణం ఏమయి ఉంటుంది ? ఉన్న ఉద్యోగంలో…అమ్మ కొడుకు ఆనందంగా ఉంటె ..ఎవరికీ కడుపు మండింది. తెలియాలి…వారిపై దాడి చేసిన ఆ బద్మాష్ గాళ్ళు పట్టుబడాలి. కనీసం కనికరం లేకుండా …ఇంత అన్యాయంగా లేపాయి అనుకున్నారు అంటే కచ్చితంగా …సమ్ థింగ్ రాంగ్
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి కొడుకు పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయ సమీపంలో నివసిస్తున్న తల్లి రేణుక , తనయుడు యశ్వంత్‌లు ఇంట్లో ఉండగా, 12 గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో విచక్షణరహితంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో తల్లి కుమారులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. యశ్వంత్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: POCSO Case: బాలికపై గ్యాంగ్‌రేప్..ఐదుగురు కామాంధులు అరెస్టు
యశ్వంత్ గతంలో మౌలాలీలో రైల్వే కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం చేశాడు.కాపుకాసి పథకం ప్రకారమే దాడులకు పాల్పడినట్లు బాధిత యశ్వంత్ సోదరుడు వినయ్ తెలిపాడు. దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, దాడులకు గల కారణాలపై చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వైపు తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్ కడుపులో బలమైన గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు వీరికి సర్జరీ చేశారు.
గాంధీ ఎమర్జెన్సీ వార్డులో వీరు చికిత్స పొందుతున్నారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఘటన స్థలంతో పాటు గాంధీ ఆసుపత్రి ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్ట పగలు జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.