ఆర్మాక్స్ సంస్థ సెప్టెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ నటీ నటుల జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో అత్యంత ప్రజాద రణ పొందిన హీరోల జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ నిలిచారు. రెండో స్థానంలో డార్లింగ్ హీరో ప్రభాస్ ఉన్నాడు. మూడో ప్లేస్ లో షారుక్ ఖాన్ ఉన్నారు. విజయ్ ఇటీవల ‘గోట్’ చిత్రంతో ప్రేక్ష కుల ముందుకు వచ్చారు. దీంతో పాటు ప్రత్యక్ష రాజకీయా ల్లోకి కూడా వస్తుండటంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల ఆయన గురించి తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆయన టాప్ ప్లేస్లో ఉన్నారు.
ప్రభాస్ ‘కల్కి’తో పాపులా రిటీని పెంచేసుకున్నాడు. టాప్ టెన్ లో ఏడుగురు దక్షిణాది హీరోలు ఉండటం విశేషం. హీరోయి జాబితాను పరిశీలిస్తే సమంత ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్ల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆవిష్కరించిన అంతరంగం నెటిజన్లను కట్టిప డేసిందని చెప్పొచ్చు. రెండో స్థానాన్ని ‘జిగ్రా’తో పలకరించిన అలియాభట్ సొంతం చేసుకున్నా రు. ఇదీంతో నటీమణుల జాబితాలో టాప్ ప్లేస్కు వచ్చారు. హీరోయిన్ల జాబితాలో ఆరుగురు దక్షిణా ది సినిమాల్లో నటిస్తున్న తారలు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో షేర్ అవుతుండగా.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మాక్స్ మీడియా జాబితా హీరోలు
1. విజయ్
2.ప్రభాస్
3. షారుక్ ఖాన్
4.అజిత్ కుమార్
5. ఎన్టీఆర్
6.అల్లు అర్జున్
7.మహేశ్ బాబు
8.అక్షయ్ కుమార్
9. రామ్ చరణ్
10.సల్మాన్ ఖాన్
హీరోయిన్లు
1. సమంత
2.అలియా భట్
3. దీపికా పదుకొణె
4. నయనతార
5.త్రిష
6.శ్రద్ధాకపూర్
7.కాజల్ అగర్వాల్
8. సాయిపల్లవి
9. రష్మిక
10. కియారా అద్వాణి