Vishwambhara: విశ్వంభర ఫస్ట్ గ్లిమ్స్ పై గతంలో మిశ్రమ స్పందన వచ్చింది. మరి ముఖ్యంగా VFX వర్క్ పట్ల దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అటు ఫ్యాన్స్ ను కూడా విశ్వంభర ట్రైలర్ బాగా నిరుత్సహపరిచింది.దీంతో తాజాగా మెగాస్టార్ యూనిట్ కు కీలక సూచనలు చేసారు. ఇప్పటి దాకా VFX వర్క్ చేసిన టీమ్ ను మొత్తం మార్చి మరొక టీమ్ కు వర్క్ అప్పగిచారు. ప్రస్తుతం చేస్తున్న టీమ్ వర్క్ పట్ల యూనిట్ పాజిటివ్ గానే ఉందని తెలుస్తుంది. అందుకు నిదర్శనం ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ పోస్టర్. ఈ పోస్టర్లో చిరంజీవి లుక్ వింటేజ్ చిరును తలపించింది. సోషియో ఫాంటాసి కథ కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే క్వాలిటిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా స్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విశ్వంభర వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
