టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ థియేటర్లలో కనిపి స్తాడోనని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మో క్షజ్ఞను జోడీగా ఎవరిని తీసుకోవాలనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేప థ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుమార్తె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే సినీవర్గాల సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండన్ నటించబోతుందట. ఇప్పటికే ఆ విషయమై చర్చలు కూడా జరిగాయట. దీనిపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాల కృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని సమర్పిస్తున్న ఈ మూవీని ఎస్. ఎల్. వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సమర్పిస్తున్నారు.
తెలుగులోనూ రవీనా నటించారు. ఇక రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 2లో కీలక పాత్రలో నటించి మెప్పించింది రవీనా. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కోసం రవీనా కూతురు రాషా థడానిని రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే ఈ చిన్నది ఆడిషన్ కూడా ఇచ్చిందని.. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే భారీ సినిమాలను కూడా లైనప్ చేశారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఇప్పుడు బాబీతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అలాగే బోయపాటితో అఖండ 2ను కూడా లైనప్ చేశారు.