Mokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో హీరోగా పరిచయమవుతున్న మోక్షజ్ఞకు జోడిగా రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను గ్రాండ్‌గా హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఇఫ్ఫీ వేడుకల్లో బాలయ్య స్వయంగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: Teja Sajja: తేజ సజ్జ నుంచి మరో దేవుడి కథ..?
ఈ సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఫిక్స్ అయినట్టు రూమర్ వైరల్ అవుతోంది. రాషా ఇప్పటికే బాలీవుడ్‌లో ఉయ్యమ్మ అనే సాంగ్ తో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఘట్టమనేని జయ కృష్ణ డెభ్యు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

