Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 45 ఇయర్స్ కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ మూవీస్, క్యారెక్టర్స్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించి.. లాంగ్వేజ్ తో సంబధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఈ 2025 ఫస్ట్ హాఫ్ లో.. లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తో సూపర్ హిట్ కొట్టి, తర్వాత తుడరుమ్`తో మరో సాలిడ్ ఫిల్మ్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప`లో `కిరాత క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ స్టార్ట్ అయిందో లేదో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసేశారు.. ఇది ఆయన నటిస్తున్న 365వ సినిమా కావడం విశేషం. L 365 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీని ఆస్టిన్ డాన్ థామస్ డైరెక్ట్ చేస్తున్నారు. గతకొంత కాలంగా ఓన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ లో మూవీస్ చేస్తున్న లాల్.. ఈ మూవీని బయట నిర్మాతతో చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పార్ట్ అవడం హ్యాపీగా ఉందంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.. ఈ వయసులోనూ యంగ్ హీరోల సైతం షాకయ్యేలా, ఇండస్ట్రీ వారు ఆశ్చర్యపోయేలా క్రేజీ ప్రాజక్ట్స్ లైన్ లో పెడుతున్నారు మోహన్ లాల్.

