L2: Empuraan: మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రిలీజై సంచలనం సృష్టిస్తోంది. కానీ, ఈ సినిమాకు హిందుత్వవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమన్యు సింగ్ పాత్ర ద్వారా పృథ్వీరాజ్ తన హిందూ వ్యతిరేక ధోరణిని చూపించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ ఇండియాలో సినిమాను బ్యాన్ చేయాలని, పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అభిమన్యు సింగ్‌ను గుజరాత్ అల్లర్లలో ముస్లిం వ్యతిరేకిగా, ఆ తర్వాత హిందుత్వ నాయకుడిగా చూపించడం ఓ రాజకీయ నేతను టార్గెట్ చేసినట్లుగా ఉందంటూ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అయితే, దీనిపై పృథ్వీరాజ్ లేదా మోహన్‌లాల్ ఇంతవరకు స్పందించలేదు. సైలెంట్‌గా ఉంటేనే బెటరని యూనిట్ భావిస్తోంది. వారం, పది రోజుల్లో సినిమా రన్ పూర్తయితే వివాదం సద్దుమణుగుతుందని అంచనా. రాజకీయ రగడ కావడంతో ఇది ఎటు దారి తీస్తుందోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.
