Mohan Bhagwat:

Mohan Bhagwat: రాజ‌కీయ నాయ‌కుల రిటైర్మెంట్‌పై మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

Mohan Bhagwat:దేశంలో రాజ‌కీయ నాయ‌కుల రిటైర్మెంట్ వ‌య‌సుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఆయ‌న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపనున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌లు దేశవ్యాప్తంగా తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్య‌లు చేశారా? అన్న అనుమానాలు దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Mohan Bhagwat:రాజ‌కీయ నాయ‌కులు 75 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక హుందాగా త‌ప్పుకొని ఇత‌రుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ స్ప‌ష్టం చేశారు. మ‌హారాష్ట్ర నాగ‌పూర్‌లో జ‌రిగిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంత‌క‌ర్త మోరోపంత్ పింగ్లేపై రాసిన పుస్త‌కావిష్క‌ణ‌లో భ‌గ‌వ‌త్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా పింగ్లే జీవితాన్ని సోదాహ‌ర‌ణంగా ఉద‌హ‌రించారు.

Mohan Bhagwat:ఒకనాడు పింగ్లే ఇలా చెప్పారు. 75 ఏళ్ల వ‌య‌సులో మీకు శాలువా ప‌డితే అది ప‌ద‌వికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలి.. అని చెప్పార‌ని తెలిపారు. దేశ సేవ‌లో పింగ్లే ఎంత నిబ‌ద్ధ‌త చూపినా, వ‌య‌సు వ‌చ్చిన‌పుడు ప‌క్క‌కు త‌ప్ప‌డం ఒక సంస్కార‌వంత‌మని మోహ‌న్ భ‌గ‌వ‌త్ చెప్పారు. ఎంత దేశ‌భ‌క్తి ఉన్న‌ప్పటికీ వ‌య‌సు వ‌చ్చాక త‌ప్పుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని పేర్కొన్నారు.

Mohan Bhagwat:ఇదిలా ఉండ‌గా, ఈ వ్యాఖ్య‌లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గురించి చేసిన‌వేన‌ని కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వి, శివ‌సేన (ఎంబీటీ) ఎంపీ సంజ‌య్ రౌత్ త‌దితరులు పేర్కొంటున్నారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో మోదీకి 75 ఏళ్ల వ‌య‌సులోకి అడుగు పెడ‌తార‌ని, ఆయ‌న ప‌క్క‌కు త‌ప్పుకొని దేశ ప్ర‌ధానిగా మ‌రో నేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌రోక్షంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఈ సూచ‌న‌లు చేశార‌ని వారితోపాటు ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Mohan Bhagwat:బీజేపీలో నాటి కీల‌క నేత‌లైన ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, జ‌స్వంత్‌సింగ్ వంటి నేత‌లెంద‌రినో 75 ఏళ్ల వ‌య‌సు రాగానే ఇదే మోదీ ప‌క్క‌కు నెట్టారని, మ‌రి అదే ఆయ‌న‌కు ఇప్పుడు 75 ఏళ్ల వ‌య‌సు రాగానే ఆ నిబంధ‌న‌ను ఆయ‌న పాటిస్తారా? లేదా? అని ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది దేశ‌వ్యాప్త చ‌ర్చ‌కు దారి తీసే అవ‌కాశం ఉన్న‌ది. రాష్ట్రాల‌లో కూడా వృద్ధ రాజ‌కీయ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు ఈ వ్యాఖ్య‌లు దోహ‌దం చేస్తాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ktr: ఫార్ములా-ఈ రేస్ కేసు: మొబైల్ ఇచ్చేది లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *