Mohan Babu: వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు తాజాగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఆయన కుటుంబంలో మంచు విష్ణు, మనోజ్ వివాదాల కారణంగా రచ్చకెక్కి రోజుకో మలుపు తిరుగుతూ ఉన్నది. గొడవలపై మోహన్‌బాబుపై ఫిర్యాదుల ఆధారంగా విచారించేందుకు ఆయనకు పోలీసులు ఇచ్చిన గడువు మిగియవస్తున్నది. ఈ దశలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.
Mohan Babu: తన ఫొటోలు, వాయిస్‌ను గూగుల్‌లో ఇతర సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని మోహన్‌బాబు హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మోహన్‌బాబు కంటెంట్‌ను గూగుల్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ విషయంపై పలు వార్తలు వస్తున్నాయి.


