Mohan Babu: మంచు ఫ్యామిలీకి మ‌రో షాక్‌.. ఏపీలో మోహ‌న్‌బాబు, విష్ణుపై కేసు

Mohan Babu: ఇటీవ‌లే కుటుంబ క‌ల‌హాల‌తో స‌త‌మ‌త‌మైన ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, న‌టుడు మంచు విష్ణుపై ఏపీలో కేసు న‌మోదైంది. తిరుప‌తిలోని తిరుచానూరు పోలీస్ స్టేస‌న్‌లో వారిపై పోలీసులు కిడ్నాప్ కేసు న‌మోదు చేశారు. నిన్న (ఫిబ్ర‌వ‌రి 3న‌) మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ (ఎంబీయూ)కి చెందిన కొంద‌రు బౌన్స‌ర్లు విద్యార్థి సంఘం జిల్లా నేత‌ల‌ను కిడ్నాప్ చేశార‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వ‌ర్సిటీ యాజ‌మాన్యంతోపాటు వీరిపైనా కేసు న‌మోదు చేశారు.

Mohan Babu: మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ (ఎంబీయూ)లో అధిక ఫీజుల‌కు నిర‌స‌న‌గా తిరుప‌తిలో జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద భార‌త విద్యార్థి సంఘం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. అక్క‌డికి వ‌స్తున్న క్ర‌మంలో జిల్లా నేత‌లైన ఓ ముగ్గురిని వ‌ర్సిటీకి చెందిన సుమారు 30 మంది బౌన్స‌ర్లు కిడ్నాప్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపింది. దీనిపై ఆ సంఘంతోపాటు సీపీఎం నాయ‌కులు తీవ్రంగా ప‌రిగ‌ణించారు.

Mohan Babu: దీనిపై స‌మాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు.. ఆ దుండ‌గుల వాహ‌నాల‌ను వెంబ‌డించారు. వాహ‌నాల‌ను నిలిపి బాధితుల‌ను వారి చెర నుంచి విడిపించారు. నిందితుల‌ను అక్క‌డే అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు వ‌ర్సిటీ పీఆర్‌వో స‌తీశ్ (ఏ1), మోహ‌న్‌బాబు (ఏ2), విష్ణు (ఏ3)పై తిరుచానూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *