Mohammed Siraj Net Worth: ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్. ఇప్పుడు సిరాజ్ పేరు అందరి నోట వినిపిస్తోంది. ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటనలో అతని అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఐదు టెస్ట్ ల సిరీస్ ను 2-2 తో సమం చేయడంలో సహాయపడింది.
అయితే మహ్మద్ సిరాజ్ ఆస్తులకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియా నివేదికల ప్రకారం అతని నికర విలువ 2025 నాటికి సుమారు రూ. 57 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆదాయం ఐపీఎల్ కాంట్రాక్టులు, బీసీసీఐ జీతాలు మరియు వివిధ ఎండార్స్‌మెంట్‌ల నుండి వస్తుంది, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్: సిరాజ్ ప్రస్తుతం బీసీసీఐ ‘గ్రేడ్ A’ కాంట్రాక్ట్‌లో ఉన్నారు, దీని ద్వారా అతనికి సంవత్సరానికి రూ. 5 కోట్లు లభిస్తాయి. దీంతో పాటుగా అతను ఆడే ప్రతి మ్యాచ్‌కు ప్రత్యేక ఫీజులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: Fire Accident: కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
అతను టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు మరియు టి20ఐకి రూ.3 లక్షల మ్యాచ్ ఫీజులు అందుకుంటాడు ఐపీఎల్ ద్వారా కూడా సిరాజ్ భారీగా సంపాదిస్తున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ఐపీఎల్ కెరీర్ మొత్తం సంపాదన దాదాపు రూ.40 కోట్లుగా ఉంది. అతని ప్రజాదరణ పెరగడంతో, అనేక బ్రాండ్లతో ప్రకటన ఒప్పందాలు చేసుకున్నారు. My11Circle, థమ్సప్, కాయిన్‌స్విచ్‌కుబేర్ వంటి బ్రాండ్ల నుంచి కూడా అతనికి కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. ఈ ఆదాయంతో పాటుగా, సిరాజ్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోరూ.13 కోట్లు విలువైన విలాసవంతమైన ఇంటిని, అలాగే పలు ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు. ఆనంద్ మహీంద్రా అతనికి బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ వంటి లగ్జరీ వాహనాలు ఇందులో ఉన్నాయి.