Mogilaiah: జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు.’బలగం’ సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న మొగిలయ్య, జానపద గేయాలకు ప్రాణం పోశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు నటుడు చిరంజీవి, దర్శకుడు వేణు సహాయం అందించినా, ఆరోగ్యం మరింత క్షీణించడం దురదృష్టకరం. వరంగల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు.
తన గానం ద్వారా గ్రామీణ భావజాలం మనుగడను ప్రతిబింబించిన మొగిలయ్య, బలగం సినిమా క్లైమాక్స్‌లో అలపించిన పాట భావోద్వేగానికి గురి చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇలాంటి గొప్ప కళాకారుడి మృతితో సాంస్కృతిక రంగం గొప్ప కళాకారుడిని కోల్పోయింది. కాగా మోగిలయ్య మన వార్త విన్న సినీ ప్రముఖులు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.