Modi: దేశ రక్షణ విషయంలో పాక్‌కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో త్రివిధ దళాధిపతులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత్ శాంతిని కోరితేనేగానీ, సవాళ్లను తిప్పికొట్టే శక్తి దేశానికి ఉందని మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ చేసిన కీలక వ్యాఖ్యలు:
పాక్ నుంచి ఒక్కవేళ కాల్పులు జరిగితే, భారత్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించాలి.పాక్ దాడులకు దిగితే, భారత్ దాడులకు వెనుకాడదు.ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఇది కొనసాగుతుంది.”అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే, ఇటు నుంచి మిస్సైల్స్ ప్రయోగించాలి,” అని ధీటుగా తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి భారత్ శక్తిని చాటిచెప్పిందని మోదీ పేర్కొన్నారు.ప్రతి దశలో పాకిస్తాన్ దిగజారుతోంది.ఈసారి ఉగ్ర శిబిరాలకే కాకుండా, ఉగ్రవాదానికి కేంద్రాలైన హెడ్‌క్వార్టర్లను ధ్వంసం చేశామని తెలిపారు.బహావల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్‌లలో ఉగ్ర శిబిరాలను పూర్తిగా నాశనం చేశామని పేర్కొన్నారు.ప్రతి రౌండ్‌లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిందని స్పష్టం చేశారు.వైమానిక దాడుల అనంతరం పాక్ చేతులెత్తేసిందని అన్నారు.సింధు ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామన్నారు. ఉగ్రవాదం ఆగే వరకు ఒప్పందం అమలులో ఉండదని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో ప్రధానమంత్రి మోదీ మరోసారి భారత్ విధానం స్పష్టంగా చెప్పారు. శాంతిని కోరుతున్నా, హింసకు ప్రతిఘాతంగా ఖచ్చితమైన చర్యలు తీసుకోవడంలో ఏ తడబాటు లేదని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదంపై భారత్ విధానంలో ఒక్క అంచె తగ్గేదిలేదన్నది మోదీ సందేశం.